ప్రేమలో పడితే సంకేతాలివే
ప్రేమలో పడ్డారని గుర్తించడం కొంచెం ఆలస్యం కావచ్చు. ఎందుకంటే వారికున్నది ప్రేమా, ఆకర్షణా అనేది తెలియకపోవడంవల్ల కావచ్చు. మరికొందరు త్వరగానే గుర్తించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేకంగా ఇలానే ఉంటారని కానీ ఇలాగే ఉండాలని కానీ ఏమీ లేదు. కాకపోతే కొన్ని లక్షణాలు అందరిలో ఒకలాగే ఉంటాయి. అలాంటివి మీలోనూ ఉన్నాయేమో, మీరు ప్రేమలో పడ్డారేమో చెక్ చేసుకోండి.
1. ఎప్పుడూ మీ ప్రేయసిని కానీ, ప్రియుణ్ణి కానీ చూడాలని అనిపించడం. తనతోనే ఉండాలని అనిపించడం.
2. వారి దగ్గర నుంచి వచ్చే సందేశం కోసం కానీ, ఫోన కాల్ కోసం కానీ వేచి చూడడం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి సమాధానం ఇవ్వడం కోసం ఆత్రంగా ఉండడం. తరచూ ఫోన్ తనిఖీ చేస్తూ ఉండడం.
3. కొన్నిసార్లు మీకిష్టం లేకున్నా సరే మీరు ప్రేమించే వ్యక్తి కోసం రాజీపడడం
4. ప్రేమించే వ్యక్తికోసమే కార్యక్రమాలను మార్చు కోవడం. ఒక్కొక్కసారి ప్రాధాన్యం గలవాటిని కూడా తనకోసం వదిలేసుకోవడం.
5. కారణం ఏమీ ఉండకపోయినా, కొన్ని సార్లు మీలో మీరే నవ్వుకోవడం. తనతో ఉన్న క్షణాలను ఎప్పుడూ గుర్తు తెచ్చుకోవడం. తనని కేర్‌గా చూసుకోవాలని అనుకోవడం.
మనసులో మాట చెప్పే మార్గాలు
ప్రేమికుల రోజు ఎలా ఎంజాయ్ చేయాలి? మదిలోని భావాలను ఎలా పంచుకోవాలి? స్వీట్ మెమరీగా గుర్తుండాలంటే ఏంచేయాలి? ఇలాంటివన్నీ ప్రేమికులకు కష్టమైన ప్రశ్నలు. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న మనసులోని మాట నచ్చిన వ్యక్తికి ఎలా చెప్పాలనేదే. అయితే పాత పద్థతులుగా అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రేమికులు అలాంటి వాటినే ఉపయోగిస్తున్నారు. మరి మీ మనసులోని మాట చెప్పాలంటే ఉన్న దార్లేంటో తెలుసుకోండి! ఎలా చెప్పినా సరే మీ మనసుకు నచ్చిన వ్యక్తికి మీలోని నిజాయితీ, మీ ప్రేమా కనిపించాలి. అది మీరు మనస్పూర్తిగా ఇస్తేనే సాధ్యపడుతుంది.
అందంగా చెప్పండి: నోటితో చెప్పడానికి భయపడే వారికి గ్రీటింగ్ కార్డ్స్ చక్కని మార్గం. మంచి ముఖచిత్రంతో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. కుదిరితే మీరే చక్కని గ్రీటింగ్‌కార్డ్ మీ చేతుల్తో తయారు చేసివ్వండి.
మదిలోని భావాలు: కొందరు కవిత్వం రాసేవారు ఉంటారు. అలాంటి వారు తమ మదిలో భావాలను, తనతో ఉన్న జ్ఞాపకాలతో ముడివేస్తూ అందంగా రాసి ఇవ్వండి. ప్రేమలేఖను రాయండి.
జ్ఞాపకాలే బహుమతిగా: మీ ప్రియమైన వారితో ఉన్న ఫోటోలను తిరిగి జ్ఞాపకం చేస్తూ ఒక ఆల్బమ్‌గా తయారు చేసి వారికి తీపి గుర్తుగా ఇవ్వండి.
పువ్వుల్లో పెట్టి:మీరు రాిసిన అందమైన ప్రేమలేఖను ఒక గిఫ్ట్‌తో జతచేస్తూ పువ్వుల్లో పెట్టి తనముందు ఉంచండి. పువ్వులు రకరకాల భావాలను వ్యక్తీకరిస్తాయి. ఒక్కో రకం పూవు ఒక్కో రకం రిలేషన్‌కి చిహ్నం. అందుకని రెడ్ రోజాలను మాత్రమే ఎంచుకోండి.
No Comment to " Ways to Propose a Girl for Love "